సీఎంఆర్ఎఫ్ ద్వారా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు రూ.15 లక్షల ఆర్థికసాయం అందజేత
మంత్రి లోకేష్ కు కృతజ్ఞతులు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు.
Trinethram News : చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపూ నాయుడు అనే చిన్నారి పుట్టకతోనే లివర్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో ఆర్థికసాయం కోసం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవడం జరిగింది. దీంతో వైద్యఖర్చులకు గాను రూ.10లక్షల వరకు ఎల్ వోసీ మంజూరుచేయడం జరిగింది. అయితే లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అధికమొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్యసాయాన్ని రూ.15 లక్షల వరకు పెంచి ఎల్ వోసీ మంజూరు చేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారిని వెంటనే కలుసుకుని సాయం అందజేయడం గొప్ప విషయమని, ఒక్కరోజులోనే స్….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


