Vampuru Gangulaiah : వంపూరు గంగులయ్య జన్మదిన వేడుకలు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహణ

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా(పాడేరు) త్రినేత్రంన్యూస్ జులై 2 : జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య జన్మదిన వేడుకలు పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు మరియు వీరమహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడమేగాక, పార్టీ శ్రేణుల మధ్య ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మాట్లాడిన పార్టీ నాయకులు మాట్లాడుతూ, గంగులయ్య జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల అత్యంత నిబద్ధతతో, క్రమశిక్షణతో పని చేస్తున్నాడని ప్రశంసించారు. పార్టీకి కష్టకాలంలో కూడా భరోసా కలిగించి, అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు. పాడేరు అసెంబ్లీ నుంచి అవకాశం చేజారినా, గంగులయ్య ఎలాంటి నిరాశకు లోనవకుండా మరింత ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలందరికీ చేరవేసే ప్రయత్నం చేశారని వివరించారు. రాజకీయ కృషితో పాటు అనేక సేవా కార్యక్రమాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో జనసేన పట్ల విశ్వాసం పెరిగేలా చేశారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వంపూరు గంగులయ్య ని జనసేన నాయకులు పూల బుకేలు, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్పందనలో గంగులయ్య మాట్లాడుతూ, తనపై చూపిన అభిమానానికి జనసేన శ్రేణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి కుటుంబాన్ని తనకు అందించిన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జనసేన బలోపేతానికి చిత్తశుద్ధితో పని చేస్తానని పేర్కొన్నారు.జన్మదిన వేడుకల అనంతరం విశాఖ రూరల్ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం ఆధ్వర్యంలో చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీలో మర్రి, మనోహర్, వంతల పరమేశ్‌లు డా. గంగులయ్య చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కొర్ర కమల్ హాసన్, బొంకుల దివ్యలత, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, ఐటీ ఇంచార్జ్ సాలెబు అశోక్, కో-ఆర్డినేటర్ సీహెచ్ అనిల్ కుమార్, టౌన్ అధ్యక్షుడు మజ్జి నాగేశ్, తదితరులు పాల్గొన్నారు. గిరిజన యువత, మహిళా శ్రేణులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను మరింత వైభవోపేతంగా మార్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vampuru Gangulaiah's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top