రామగుండం, జూన్-30 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పనపై నివేదిక పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గోదావరిఖని జనరల్ ఆసుపత్రి , వైద్య కళాశాలను వైద్య సంచాలకులు శివరాం ప్రసాద్, టీఎస్ఎంఐడీసీ ఈఈ విశ్వ ప్రసాద్ తో కలిసి హాస్పిటల్ మరియు వైద్య కళాశాలను పరిశీలించి అనంతరం కళాశాలలో నిర్వహించిన జిజిహెచ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, వైద్య కళాశాల, టీచింగ్ ఆసుపత్రులలో మౌలిక వసతుల , ఫ్యాకల్టీ వివరాల పై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తయారు చేసేందుకు ప్రత్యేక కమిటీ రూపొందించిందని అన్నారు. జాతీయ వైద్య కౌన్సిల్ నియమించిన రాష్ట్ర వైద్య బృందం పర్యటించి నివేదిక తయారు చేసిందని అన్నారు
ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు సింగ్ కమిటీ సభ్యులు, డాక్టర్ రాజు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


