MLA Nenavath Balu Naik : ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం

TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ.
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ జూన్30 త్రినేత్రం న్యూస్.
దేవరకొండ నియోజకవర్గంలోని గన్యా నాయక్ తండా గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఎ.రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయల నిధులతో ఇందిరమ్మ మంజూరు చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు.

-పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన రేషన్ కార్డులను మన ప్రజా ప్రభుత్వం అధికారంలోని వచ్చాక మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పాలన అనే కార్యక్రమంతో పేద ప్రజలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు.

గత బిఆర్ఎస్ పార్టీ పేద ప్రజలను మోసం చేస్తూ సంక్షేమం విషయంలో ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. అలాగే పది ఏండ్లు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ మేలు చేస్తోందని అన్నారు. రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేసే సన్నబియం చాలా పేద కుటుంబాలు ఆధారపడి ఉంటాయని వారికి తీవ్ర అన్యాయం చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది అని స్పష్టం చేశారు.

రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని గుర్తు చేశారు అలాగే మూడు నెలల సన్న బియ్యం ఒకేసారి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. రేవంతన్న సర్కార్ విద్యా మరియు వైద్యంపై చిత్తశుద్ధితో పని చేస్తుందని అలాగే 5 లక్షలు ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి పేద ప్రజల వైద్యానికి తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ సర్కార్ రైతన్నలకు వెన్నంటే ఉందని రైతు భరోసా ద్వారా రైతన్నల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడం జరిగిందని రైతు మొఖంలో చిరునవ్వు చూడటమే మా ప్రజా ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు, కార్యకర్తలు,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will grant Indiramma

You cannot copy content of this page

Scroll to Top