అనారోగ్యంతో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి

TRINETHRAM NEWS

-ఎర్ర యాకన్న.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 26 : తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న కోరారు. బుధవారం రోజు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కూకట్పల్లి సీనియర్ జర్నలిస్టు నిలువుటద్దం నాగరాజు దరఖాస్తును ఆయనకు అందజేశారు.

ఈ సందర్భంగా కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యంతో మృతి చెందిన, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వ నుండి ఆదుకోవాలని ఆయన కోరారు. సానుకూలంగా స్పందించిన మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరికీ కూడా పెన్షన్స్ కానీ, సహాయం కానీ నిలిపి వేయలేదని, ఒకవేళ ఐదు సంవత్సరాలు పూర్తయిన వారికి రావని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Families of journalists who

You cannot copy content of this page

Scroll to Top