కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 26 : ఇటీవల శాసన మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన సిని నటి ఎమ్మెల్సీ విజయశాంతి ని కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్.టి.యు.సి అధ్యక్షులు, హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్క నాగరాజు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఫూల భోకేతో శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ యూనియన్ లీడర్స్ గా కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికై కృషి చేయాలని సూచించారు.ఏవైనా సమస్యలుంటె తనని సంప్రదించాలని ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కార్మికులకు, పేద ప్రజలకు అండగా ఉంటుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు కుతాడి కృష్ణా, ఆఫీస్ కోర్డినేటర్ కే.సురేష్, జాయింట్ సెక్రెటరీస్ నాగార్జున, యస్.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


