హన్నా నాయక్ మృతి పార్టీకి తీరని లోటు
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ జూన్ 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని చందంపేట మండలం యలమలమంద గ్రామ పంచాయతీ పరిధిలోని చౌటుట్లకు చెందిన కేతావత్ హన్నా నాయక్ మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం హన్నా నాయక్ మృతి దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. హన్నా నాయక్ మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు . హన్నా నాయక్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.ఆయన వెంట సర్పంచుల మాజీ రాష్ట్ర కార్యదర్శి జర్పుల లోక్య నాయక్,బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కేతావత్ శంకర్ నాయక్ మాజీ సర్పంచ్ కేతావత్ నెహ్రూ, కేతావత్ రమేష్ నాయక్, రమావత్ తులసీరామ్, వడ్థ్య బాలు,వెంకటేష్,నాయకులు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


