Anti-Drug Day : మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

TRINETHRAM NEWS

దండకారణ్య కళాశాలలో విద్యార్థులకు మత్తు ద్రవ్యాలపై పోలీసుల అవగాహన

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ జూన్ 26: అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని స్థానిక దండకారణ్య కళాశాలలో మాదకద్రవ్యాల వల్ల కలిగే హానికర దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అరకు వ్యాలీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హిమగిరి, సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాలరావు లు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ ప్రసాదు మాట్లాడుతూ, “విద్యార్థులు చిన్ననాటి నుంచే మంచి పథంలో నడవాలి. మత్తు పదార్థాల ప్రభావానికి లోనవ్వకూడదు” అని అన్నారు. ఎంఫీడీఓ లోవరాజు మాట్లాడుతూ, “మాదకద్రవ్యాలకు బానిసలు ఎప్పటికీ జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోలేరు” అని స్పష్టం చేశారు.
అరకులోయ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ డా. ఆదిత్య మాట్లాడుతూ, “గంజాయి వంటి మత్తు పదార్థాల వలన శరీరావయవాలు నశించిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి” అని వివరించారు. ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ మరియు స్థానిక ఎస్‌ఐ గోపాలరావు మాట్లాడుతూ, గంజాయి స్మగ్లర్లు ఎలా యువతను వలలో పడేస్తున్నారో ఆసక్తికరంగా వివరించారు.
ఈ సందర్భంగా “మాదకద్రవ్యాల వినియోగం – నష్టాలు” అనే అంశంపై విద్యార్థుల మధ్య వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రత్యేకంగా ప్రతిభా అవార్డు గెలుచుకున్న దండకారణ్య కళాశాల విద్యార్థిని కుమారి మహమ్మద్ హలీమా సాహెదాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు శ్రీను మాస్టర్, అధ్యాపక సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై చక్కటి అవగాహన పొందారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Awareness program on the

You cannot copy content of this page

Scroll to Top