తేదీ : 23/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రధానంగా మసీద్ సెంటర్ నుండి బస్ స్టేషన్ కు వెళ్లే రహదారి, శ్రీరాములు విగ్రహం వద్ద , ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే రహదారులు వర్షం పడితే దరిద్రంగా గుంతలు, గుంతలుగా మారుతున్నాయి.
దీంతో రాకపోకలు సాగించేందుకు, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


