వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : AICC అద్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే తో పరిగి MLA TRR ఢిల్లీ పర్యటనలో ఉన్నా DCC అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ను కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఈసారి తనకు అవకాశం కల్పించాలని వినతిపత్రం అందచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి జరిగిన 3 శాసనసభ ఎన్నికలలో రెండుసార్లు గెలిచి CLP సెక్రటరీ పని చేశానని అదేవిధంగా రెండు పర్యాయాలుగా జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతు పార్టీ పటిష్టతకు పనిచేసి జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుపుటకు కృషి చేశానని ఖర్గే కు తెలియచేశారు.
2017 నుండి లో తెలంగాణ రాష్ట్ర శక్తి కన్వీనర్ గా రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పనిచేశానని, 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ మారకుండా ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగానని తెలిపారు.రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించి తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని AICC అధ్యక్షులను కోరినట్టు ఎమ్మెల్యే టిఆర్ఆర్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


