International Yoga Day : డిండి మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) జూన్ 21 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిండి ఎస్సై బోదాసు రాజుగారు విచ్చేసి యోగా విశిష్టతను యోగా వల్ల కలిగే లాభాలను తెలియజేయడం జరిగింది. యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రాచీన కాలంలో మన భారత దేశంలోనే పుట్టిన యోగ నేడు ప్రపంచంలో సుమారు 173 దేశాలు అనుసరిస్తున్నాయని తెలిపారు.

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ కృషి వల్ల అంతరించిపోతున్న యోగాను ప్రపంచం మొత్తం పఠించే విధంగా తీసుకురావడం హర్షనీయమని పేర్కొన్నారు. యువకులు విద్యార్థులు ప్రజలందరూ కూడా యోగాను తప్పకుండా చేసే విధంగా కార్యచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు భయ్యా మల్లయ్య యోగాసనాలు చేయించడం. జరిగింది. యువకులు, నాయకులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

International Yoga Day at Dindi

You cannot copy content of this page

Scroll to Top