Financial Assistance : ఆర్థిక సహాయం

TRINETHRAM NEWS

తేదీ : 15/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ చలమలశెట్టి. రమేష్ గుడివాడకు సంబంధించిన వెంకట సుబ్బారావు కుమారు డు రామ్ చరణ్ చదువులో ప్రతిభ చూపిస్తూ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ తృతీయ సంవత్సరం చదువు తున్నాడు. ఆ చదువు నిమిత్తం వై ఎన్ ఆర్ చారిటీస్ ట్రస్ట్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ దృష్టికి తీసుకురాగా యాభైవేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా రమేష్ పార్టీలకు అతీతంగా, కృష్ణాజిల్లాలో వైఎన్ఆర్ చారిటీస్ చేసే అనేక సేవా కార్యక్రమాలను స్మరించుకొని జయప్రకాష్ ను చాలు వాతో సత్కరించడం జరిగింది. స్థానికులందరూ కూడా సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, (రిటైర్డ్ ప్రిన్సిపల్ కానుమోలు కళాశాల), వడ్డీ. బా పులపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు వడ్డీ. నాగేశ్వరరావు, కె. బుజ్జి, వి. నాగయ్య, తోట. రాము, యం. బోసు బాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Financial assistance

You cannot copy content of this page

Scroll to Top