Ketawat Babu Ram Naik : దేవరకొండ నియోజక వర్గంలో అనుమతులు లేని పాఠశాలలను మూసివేయాలి

TRINETHRAM NEWS

తెలంగాణ గిరిజన సంస్కృతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కేతావత్ బాబు రామ్ నాయక్.

దేవరకొండ జూన్ 11 త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ పట్టణంలో మరియు ఇతర ప్రాంతంలో ఉన్న పర్మిషన్ లేని ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లను మూసివేయాలని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో రీజినల్ జాయింట్ డైరెక్టర్ కు తెలంగాణ గిరిజన సంస్కృతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్ ఫిర్యాదు చేశారు.

బుధవారం నాడు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుల వారి కార్యాలయంలో ఫిర్యాదు చేసారు ఈ సందర్భంగా బాబు రామ్ నాయక్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ని పర్మిషన్ లేని స్కూల్, ను మరియు విద్యా సంస్థలను మూసివేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది నల్లగొండ జిల్లా, దేవరకొండ పట్టణం, ముదిగొండ రోడ్డులోని పాలపురుషోత్తం బిల్డింగ్ లో అనుమతి లేకుండా నడుస్తున్న “ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్” పై తక్షణ కఠిన చర్యలు తీసుకోవడం — సంబంధిత ఎంఈఓ గారి నిర్లక్ష్యంపై విచారణ జరిపి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలనికోరారు.
ఈ ద్వారా గౌరవనీయుల దృష్టికి తీసుకురావలసిన విషయం ఏమనగా, నల్లగొండ జిల్లా, దేవరకొండ పట్టణం, ముదిగొండ రోడ్డులోని పాలపురుషోత్తం బిల్డింగ్ లో “ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్” అనే పాఠశాల ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా పూర్తిగా అక్రమంగా విద్యా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పాఠశాలకు గతం నుండి ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు లేదా నూతన అనుమతి గానీ, పునరుద్ధరణ గానీ లేదని స్థానిక సమాచారం ద్వారా నిర్ధారణ కావడమైంది. అయినప్పటికీ విద్యా కార్యక్రమాలు, అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో నెట్టివేస్తున్నారు.

ఈ విషయమై సంబంధిత మండల విద్యాధికారి (ఎంఈఓ) గారికి పలు మార్లు సమాచారం ఇవ్వబడినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, పైగా “నాకు సంబంధం లేదు, వాళ్లు పర్మిషన్ తీసుకోలేదు, వాళ్ల ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు; నాకు తెలియదు” అనే బాధాకరమైన, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం గమనించదగిన విషయం. ఈ నిర్లక్ష్యం ప్రభుత్వం పరిపాలనా విలువలకు విరుద్ధంగా ఉంది.

అదనంగా, పాఠశాల 100 మీటర్ల పరిధిలో లిక్కర్ బార్, ఫంక్షన్ హాల్ వంటి విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధమైన సంస్థలు ఉన్నాయి అదేవిధంగా

  1. నల్లగొండ జిల్లా, దేవరకొండ పట్టణం, ముదిగొండ రోడ్డులోని పాలపురుషోత్తం బిల్డింగ్ లో అక్రమంగా నడుస్తున్న “ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్” పై పూర్తిస్థాయి విచారణ జరిపి, అనుమతి లేకుండా నడపడం నిర్ధారించిన తరువాత తక్షణంగా మూసివేసి, ఇకపై అక్రమంగా నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
  2. పాఠశాల యాజమాన్యంపై సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం (PEO ద్వారా) చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
  3. మండల విద్యాధికారి (ఎంఈఓ) గారి నిర్లక్ష్యం, అలసత్వం పై శాఖాపరమైన విచారణ జరిపి, తగిన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇతరు అధికారితో పాటు ఇతర అధికారులు కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉన్నారా అనే కోణంలో విజిలెన్స్ విచారణ జరిపించాలి.
  4. పాఠశాల పరిసరాలలో ఉన్న నిబంధనలకు వ్యతిరేకమైన అంశాలపై (లిక్కర్ బార్, ఫంక్షన్ హాల్ మొదలైనవి) చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ గిరిజన సంస్కృతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు & విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్ డిమాండ్ చేసినారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Unauthorized schools in Devarakonda

You cannot copy content of this page

Scroll to Top