Adikavi Nannaya University : నన్నయ వసతి గృహాలకు కొత్త కళ

TRINETHRAM NEWS

పనులను పరిశీలించిన వీసీ ప్రసన్నశ్రీ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మెన్ అండ్ ఉమెన్ హాస్టల్స్ కు కొత్త కళ సంతరించుకుంటుంది. వసతీ గృహాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చి భవనాలకు రంగులు వేయించి కొత్త రూపాన్ని దిద్దుతున్నారు. సోమవారం ఉమెన్స్ హాస్టల్ పనులను వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ పరిశీలించారు. యూనివర్సిటీ ఇంజనీర్లు మరియు హాస్టల్ సిబ్బందికి రిపేరింగ్ వర్క్స్ కు సంబంధించిన పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వేసవి సెలవులు వచ్చిన వెంటనే హాస్టల్స్ పై దృష్టి సారించామని మెన్ అండ్ ఉమెన్ హాస్టల్స్ లో రిపేరింగ్ వర్క్స్ చేయించామని చెప్పారు.

హాస్టల్ లోని కారిడార్లు, కిచెన్, లివింగ్ రూమ్స్, వాష్ రూమ్స్ లలో ఫ్లోరింగ్ రిపేర్లు, ఫ్లబ్లింగ్, ఎలక్ట్రికల్, శానిటరీ వర్క్స్ చేయించామన్నారు. హాస్టల్ పరిసరాలలోని తుప్పలు, వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచామన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయనని తెలిపారు. తాగునీటి సమస్యలు తొలగించేందుకు ఉమెన్స్ హాస్టల్ లో అదనంగా ఒక ఆర్.వో. ప్లాంట్ ను ఏర్పాటు చేసామని చెప్పారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తల్లిదండ్రులను విడిచి హాస్టల్స్ కు వచ్చిన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని, తద్వార విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారని తెలియజేశారు. హాస్టల్స్ లో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు యూనివర్సిటీ ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New art for Nannaya

You cannot copy content of this page

Scroll to Top