Minister Konda Surekha : మంత్రి కొండా సురేఖకు తీవ్ర అస్వస్థత

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండటంతో ఆమె సెక్రటేరియట్ కు వచ్చారు. మీటింగ్ హాల్ లోకి వెళ్తుండగా సడెన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు.

కొండా సురేఖ ఒక్కసారిగా పడిపోవడంతో ఆమె భద్రత సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. వైద్యులను పిలిపించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వైద్యులు ఆమెను చెక్ చేసి లోబీపీ, షుగర్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పారు.

కొండా సురేఖ లోబీపీకి కారణం…ఆమె ఉదయం నుంచి ఆహరం తీసుకోకపోవడమే. ఫుడ్ తీసుకోకపోవడంతో షుగర్ లెవల్స్ పడిపోయాయి. దాంతో ఆమె లోబీపీతో కళ్ళు తిరిగి పడిపోయారు. సెక్రటేరియట్ లోని ఎమర్జెన్సీ వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఆహరం తీసుకున్నారు కొండా సురేఖ . కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. కాసేపటి తర్వాత కొండా సురేఖ కేబినేట్ భేటీలో పాల్గొనేందుకు వెళ్లిపోయారు.

మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయింది. రాజీవ్ యువవికాసం , వానాకాలం పంటలపై చర్చతోపాటు, ఇందిరమ్మ ఇల్లు, భూభారతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister Konda Surekha falls

You cannot copy content of this page

Scroll to Top