జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 5: హస్మత్ పేట పరిధిలో వేంచేసియున్న శ్రీ దుర్గామాత, పరమేశ్వర సమేత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ముఖద్వారo ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వహకుడు దండగుల యాదగిరి ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు.

కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వ సత్యనారాయణ, కూకట్పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున యాదవ్, ఏఎంసీ డైరెక్టర్లు రాజేందర్ మరియు అస్లాం, కెపిహెచ్బి ప్రెసిడెంట్ ప్రవీణ్ , రవీందర్ రెడ్డి, కెపిహెచ్బి వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్, నాయకులు షహన్షా, కనకరాజు, సందీప్, కిరణ్ గౌడ్, దండగుల అమూల్య , విజయలక్ష్మి ,రమాదేవి ప్రగతి , రేష్మ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh participated in

You cannot copy content of this page