Pawan Kalyan : బెంగళూరు తొక్కిసలాట ఘటనపై పవన్ విచారం

TRINETHRAM NEWS

Trinethram News : Jun 05, 2025, బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో కలిచివేసిందంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారన్న వార్తలు మరింత బాధను కలిగిస్తున్నాయన్న పవన్ కళ్యాణ్.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan Kalyan expresses grief

You cannot copy content of this page

Scroll to Top