జూన్ 2 2025 (త్రినేత్రం న్యూస్ ) ధర్మసాగర్: స్టేషన్ ఘనపూర్ మాజీ శాసనసభ్యులు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఆదేశానుసారం ధర్మసాగర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి మండల కేంద్రంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం భారత రాష్ట్ర సమితి కెసిఆర్ పోరాట పటిమ వల్లే సాధ్యమైందన్నారు బి ఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పరుగులు తీసిందని ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభివృద్ధి కుంటపడిందని అని అన్నారు మళ్లీ తెలంగాణ అభివృద్ధి జరగాలంటే బిఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకుడు చాడ కుమార్ మాజీ ఎంపీపీ బండారి రవీందర్ మరియు పార్టీ నాయకులు శాత బోయిన రమేష్ మెరుగు రాజిరెడ్డి బాలరాజు విజయ్ కుమార్ రవి మరియు గ్రామ మండల నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


