తేదీ : 01/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, పట్టణంలో రేషన్ షాపు ఒకటి, తొమ్మిది పది, నలభై చౌక ధరల దుకాణాలు ఎమ్మెల్యే కొలకపూడి. శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మండలంలోని మునుకుల్ల గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనల ద్వారా రాష్ట్ర ప్రజలకు రేషన్ బియ్యం, సంబంధిత సరుకుల పంపిణీ జరిగింది. ఇందులో భాగంగా తిరువూరు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు ఎదురు. వెంకట నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రేషన్ షాపును ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల తహసిల్దారు రామలక్ష్మి, డిటి శ్వేత, రేషన్ డీలర్ ఈశ్వరమ్మ, కూటమి నాయకులు, సంబంధిత ప్రభుత్వాధికారులు, మునుకుల్ల గ్రామంలో మాజీ ఎంపీటీసీ శీలం. వెంకటరెడ్డి , దుబ్బాక. వెంకటేశ్వర్లు, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ వేమిరెడ్డి. వెంకటరెడ్డి , నెంబర్ కర్నాటి .శ్రీనివాస్ రెడ్డి మరియు నర్సింగు. నాగరాజు, దుబ్బాకా. వెంకటకృష్ణ, నాగరాములు, సుధాకర్, వీరబాబు, వేమిరెడ్డి. రాజేశ్వర్ రెడ్డి , రేషన్ లబ్ధిదారులు డీలర్లు పాల్గొన్నారు అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


