త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. హాజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
పాల్వంచ: మండలంలోని కిన్నెరసాని వద్ద ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి ఆదివాసీ శిక్షణ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు. అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ సభ్యులు జారే ఆదినారాయణ,పార్టీ ప్రతినిధులతో అంతర్గత సమావేశం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. ఎంపీ పోరిక బలరాం నాయక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


