గూడు లేని వారి గోస తీర్చడానికి ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఆనందం… ప్రజా ప్రభుత్వంలో పేదవాడికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వం. ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధి మా ప్రజా ప్రభుత్వ ధ్యేయం. అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత నాది. ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ మే28 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని సాయి శివ ఫంక్షన్ హాల్ లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పాల్గొని,3200 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లాంఛనంగా పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .అనంతరం ఎమ్మెల్యే నివాసం వద్ద పిఏ పల్లి మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి కలను సాకారం చేసేందుకే ఇందిరమ్మ గృహ నిర్మాణాలు లాంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి.. లబ్దిదారుల దీవెనలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి అని అన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది,పేదవాడికి ఏది ముందు అవసరమో అది ఇస్తున్నాం అని అన్నారు.
పేదవాడి కళ్లలో చిరునవ్వు చూడాలని కాస్త ఇబ్బందులు ఎదురు అయినా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం అని అన్నారు. “ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల కలను నిజం చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వ ఇండ్ల పథకం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు పోతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, నిరుపేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని అన్నారు. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
భూమిలేని నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకంలో 20 రోజులపాటు పనిచేసిన వారందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తాం అని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు ఒక సైనికునిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, RDO రమణా రెడ్డి, హౌసింగ్ PD రాజ్ కుమార్,తహసీల్దారు, ఎంపిడిఓలు,మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి,దొంతం అలివేలు సంజీవ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, PACs చైర్మన్లు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాలో ఉన్న వారు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


