Trinethram News : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో శనివారం జరిగిన జంట హత్యల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలపై కేసు నమోదు అయింది. గుండ్లపాడు జంట హత్యల ఘటనలో 30 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ6గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పేర్లను చేర్చారు. ఈ కేసులో ఏ1 గా జవిశెట్టి శ్రీను, ఏ2గా తోట వెంకటరావు, ఏ3 గా తోట గురువయ్య, ఏ4 గా నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు ఉన్నారు.
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు వద్ద గుండ్లపాడుకు చెందిన కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు అనే టీడీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణంగా హత్యచేశారు. తెలంగాణలోని హుజూర్ నగర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన వీరిద్దరూ బైకు మీద వెళ్తుండగా స్కార్పియోతో కొందరు స్కార్పియో వాహనంతో ఢీకొట్టారు. అనంతరం వారిని అలానే కొంతదూరం ఈడ్చుకెళ్లారు. తరువాత స్కార్పియో కింద కొన ఊపిరితో ఉన్నట్లు గమనించి రాళ్లతో మోది హత్యచేశారు నిందితులు. అనంతరం వాహనాన్ని అక్కడే వదిలేసి నిందితులు పరారయ్యారని తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


