డిండి ((గుండ్ల పల్లి) మే 25 త్రినేత్రం న్యూస్. ఈ రోజు అనగా 25 ఆదివారం రోజు డిండి మండల పరిధిలోని తవక్లాపూర్ గ్రామంలో నూకం రమణమ్మ, నూకం పార్వతమ్మ గేదెలు మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలకు విద్యుత్ షాక్ తో రెండు పాడి గేదెలు మృతి చెందడం జరిగింది.విద్యుత్ వైర్లు తెగి పడడంతో గేదేలు మేత మేస్తూ తెగిపడిన విద్యుత్ వైర్లను తాకడంతో రెండు పాడి గేదెలు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వెటర్నరీ డాక్టర్ మరియు విద్యుత్ అధికారులకు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది.పాలు ఇచ్చే రెండు గేదెలు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు బాధతో కనీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకొవాలని వేడుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


