గోదావరిఖని మే-23:న్యూస్ ప్రతినిధి. గోదావరిఖనిలో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు నాలుగవ డివిజన్ లో పాత రోడ్లు శిధిలం కావడం కొత్త కాలనీలు అభివృద్ది చెందుతున్న నేపధ్యంలో ప్రజల సౌకర్యార్ధం సి సి రోడ్లు నిర్మించాలని స్థానిక శాసన సభ్యులు ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ రామగుండం నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు అంచనాలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించగా రామగుండం నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు రూ. 2.00 కోట్ల తో పనులు చేపట్టడానికి అంచనా లు తయారు చేసి సమర్పించారు.
ఈ అంచనాలకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలుపడంతో పాటు రూ 2.00 కోట్లు మంజూరు చేస్తూ వెంటనే పనులు చేపట్టడానికి తగు చర్యలు తీసుకోవలసిందిగా రామగుండం నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు . సాధ్యమైనంత త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) అరుణ ని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


