MLA Jare : ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే జారేకి ధన్యవాదాలు

TRINETHRAM NEWS

పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం – ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. ఈరోజు మొద్దులగూడెం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హత కలిగిన లబ్ధిదారులకు హక్కు పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మొద్దులగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు మోరంపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేయించడం జరుగుతుందని అన్నారు.

గడిచిన 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వడం చేతకాని టిఆర్ఎస్ విమర్శలు మాని జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయడంలో సహాయకారిగా ఉండాలి అప్పుడే ప్రజల్లో కాస్తైనా గౌరవం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మండల అధికారులు, సెక్రటరీ, ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Thanks to Indiramma Praja

You cannot copy content of this page

Scroll to Top