Distribution of Indiramma House : ఇందిరమ్మ ఇండ్ల పట్టా పంపిణీ మరియు శంకుస్థాపన పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో మంజూరైన 66 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసి శంకుస్థాపన చేసిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్ వారు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఇంటి కోసం ఎదురుచూస్తున్న పేద మధ్యతరగతి ప్రజలకు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడని అదేవిధంగా పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు కడు పేదలకు అర్హులకు అందాలి ఎక్కడ అవినీతికి తావు లేకుండా సుమారు ఆరు నెలలు ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు అందే విధంగా రూపకల్పన చేశారన్నారు.

అదేవిధంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఇళ్లు కేటాయించాలని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువెళ్లి మరొక 500 ఇండ్లు నియోజకవర్గానికి మంజూరు చేయించారని త్వరలోనే మరో లిస్ట్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రేవతి, హౌసింగ్ ఏఈ జిపి సెక్రెటరీ రవి, ములకలపల్లి ఇందిరమ్మ కమిటీ సభ్యులు ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు అనుబంధ నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress Party Mandal leaders

You cannot copy content of this page

Scroll to Top