పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం మే-22//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సంఘ సంస్కర్త ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందుగా ఎం.వి.భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు
సీపీ మాట్లాడుతూ సంఘసంస్కర్త భాగ్యరెడ్డివర్మ హైదరాబాద్ సంస్థానంలో సంఘ సంస్కరణకు కృషి చేసిన మహోన్నతుడు,సంఘ సంస్కరణల కోసం అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఆంధ్రసభ స్థాపకుడిగా హైదరాబాద్లో దళిత పాఠశాలను ప్రారంభించి, దళిత అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం, ఆర్ఐ లు దామోదర్, వామన మూర్తి, మల్లేశం, సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, అర్ముడ్, స్పెషల్ పార్టీ, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


