బీసీ నేత ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
Trinethram News : కేంద్ర ప్రభుత్వం తక్షణమే కగార్ ఆపరేషన్ నిలిపివేసి సీజ్ ఫైర్ ప్రకటించి మావోయిస్టు లతో శాంతి చర్చలు జరపాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
గురువారం నాడు ఆయన హైదరాబాదులోని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో…
చత్తీస్గడ్ లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరో 27 మందిని ఏకపక్ష గా ఎకౌంటర్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఒకపక్క మావోయిస్టులు కాల్పు విరమణ ప్రకటించి చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారి మాటలు పెడచెవిన పెట్టడం సరి కాదని హాస్పిటల్ లో ఉన్న వ్యక్తిని తీసుకువెళ్లి కాల్చారని వదంతులు ఉన్నాయని ఏది ఏమైనాప్పటికీ చర్చల ద్వారా ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలని ఆయన అన్నారు
హాస్పటల్లో ఉన్న 71 సంవత్సరాల వయో వృద్ధుడిని పట్టుకెళ్ళి కాల్చడం కూడా అదో ఘనకార్యంగా ప్రకటించుకుంటున్నారని, 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టు లు లేకుండా చేస్తామని ప్రకటించారని దేశంలో బిజెపి తప్ప అన్ని పార్టీలు కూడా శాంతి చర్చలు జరపాలని విజ్ఞప్తి నా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని, దేశంలో కమ్యూనిస్టు భావజాలాన్ని అంతం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అది వెయ్యి మంది మోడీ లైనా పదివేల మంది అమిత్ షా ల కైనా సాధ్యం కాదని, తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మతాన్ని అస్త్రంగా వాడుకుంటున్నావారే కాలగర్భంలో కలిసిపోతారని ఆయన అన్నారు
నక్సలైట్ల సమస్యకేవలం శాంతి భద్రతల సమస్య కాదని, అదొక సామాజిక సమస్యని అదొక రాజకీయ సమస్య అని అధిక ఆర్థిక సమస్య అని లక్ష లైట్ల ను భౌతిక హతమార్చగలరేమో కానీ వారి మూల సూత్రాలను మాత్రం హతమార్చలేరనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని ఆయన హితవు పలికారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


