Congress : పేదల పెన్నిధి

TRINETHRAM NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
(త్రినేత్రం న్యూస్) ధర్మసాగర్ మండలం మే-21-2025. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టకునే ప్రయత్నం చేస్తున్నారు ధర్మసాగర్ మండల కేంద్రంలో 59లక్షల సిసి రోడ్ల ప్రారంభోత్సవం, అంగన్వాడీ కేంద్రం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై 8లక్షల కోట్ల అప్పుభారం ఉన్నా, పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో 59లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన నాలుగు సిసి రోడ్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో 12లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ అంగన్వాడీ భవనాన్ని ఆరు నెలలలో పూర్తి చేయాలని, 12లక్షల నిధులు సరిపోకపోతే అదనపు నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ధర్మసాగర్ గ్రామంలో మోడల్ కాలనీ, ఎస్సీ కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ లు నిర్మించాల్సిన అవసరం ఉందని త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
పేదల ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు , ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 25లక్షల మంది రైతులకు 21వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతొ ఉదరగొట్టిందని కానీ ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఏద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఏడాదిలో 4లక్షల 50వేల ఇళ్ల నిర్మాణానికి 22వేల 500కోట్లను ఖర్చు చేస్తుందని తెలిపారు. పేద ప్రజలకు, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయాని స్పష్టం చేశారు.

ధర్మసాగర్ గ్రామానికి 68ఇల్లు మంజూరు అయ్యాయని, ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. మంజూరు అయిన రెండు నెలలలో ఇంటి నిర్మాణం చేపట్టకపోతే మంజూరు రద్దు అవుతుందని తెలిపారు. అలాగే ఇంటి నిర్మాణం 600అడుగుల లోపు ఉండాలని, 600అడుగులు దాటితే బిల్లులు రావడం ఇబ్బంది అవుతుందని తెలిపారు. రైతు రుణ మాఫీ, 500బోనస్, రైతు భరోసా పథకాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోటి రేషన్ కార్డుల ద్వారా 3కోట్ల 10లక్షల మందికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి గొప్ప ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అందరి ఆశీర్వాదలు ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు అంగన్వాడి టీచర్లు, ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Poor people's welfare

You cannot copy content of this page

Scroll to Top