Organic Growth Medicines : రైతులకు ఉచితంగా ఆర్గానిక్ గ్రోత్ మందుల పంపిణి

TRINETHRAM NEWS

ఆర్ట్ అఫ్ గివింగ్ పేరుతో సేవా కార్యక్రమాలు – నల్లగంతుల రవి జిల్లా కోఆర్డినేటర్.

డిండి ( గుండ్ల పల్లి ) మే 17, త్రినేత్రం న్యూస్. డిండి పట్టణంలో “ఆర్ట్ ఆఫ్ గివింగ్” పేరుతో స్థానిక వ్యవసాయ మార్కెట్ అవరణంలో రైతులకు ఆర్గానిక్ గ్రోత్ మందుల పంపిణి కార్యక్రమం చేసారు. “నైబర్ గుడ్” అనే నినాదంతో ప్రొఫెసర్ అచ్యుత్ సమంత పిలుపుమేరకు తెలంగాణ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరడంతో సేవ కార్యక్రమంలో భాగంగా డిండి లో ఫెర్టిలైజర్ బాటిల్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రవి నల్లగంతుల మాట్లాడుతూ రైతులకు సేవ చేయడం వారికి అండగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సమాజంలో నిరుపేదలకు సేవ చేయడం మా బాధ్యత అని ప్రతి ఒక్కరిలో సామాజిక సేవను అలవాటు చేయడానికి ప్రయత్నిస్తాము అని యువత సేవ కార్యక్రమాలు చేయడం ద్వారా సామాజిక అభివృద్ధి జరుగుతుందనీతెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు మొగిలి దుర్గా ప్రసాద్,సేవ బృందం సభ్యులు లక్ష్మి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free distribution of organic

You cannot copy content of this page

Scroll to Top