ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా (పాడేరు) త్రినేత్రం న్యూస్ మే 18: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించబడింది. పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయంలో భారత సైనికుల సాహసోపేత విజయానికి సంఘీభావంగా ఈ ర్యాలీ ఏర్పాటైంది.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడినది. ర్యాలీలో పాల్గొన్న కూటమి నాయకులు జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు ఘన నివాళులు అర్పించారు.
పాడేరు పట్టణ వీధుల్లో “భారత్ మాతాకీ జై”, “వందే మాతరం”, “మాతరం మాతరం” వంటి నినాదాలతో దేశభక్తి సందేశం వ్యాపించింది. భారత దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని నేతలు పిలుపునిచ్చారు. దేశమంతటా సైన్యానికి అండగా నిలిచే సమయం ఇదేనని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు మఠం శాంతకుమారి, పాడేరు టీడీపీ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి, కూడా కృష్ణారావు (ట్రైబల్ డైరెక్టర్), బీజేపీ నాయకులు పాంగి రాజారావు, కురసా ఉమామహేశ్వరరావు, జనసేన అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, జనసేన ఐటీ కో-ఆర్డినేటర్ సీ.హెచ్. అనిల్ కుమార్, మండల అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు సీసాల భూపాల్, పట్టణ అధ్యక్షులు మజ్జి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే జనసేన సీనియర్ నాయకులు పాంగి శివాజీ, మజ్జి సంతోష్, తల్లే త్రిమూర్తులు, మండల నాయకులు మజ్జి సత్యనారాయణ, కుంచె దేవేంద్ర ప్రసాద్, లంకెల పవన్, చరణ్, చందు, అప్పలరాజు, బీజేపీ యూత్ వింగ్ నాయకుడు గోపాల్ పాత్రుడు తదితరులు హాజరై ర్యాలీని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


