Dhatri Madhu Arrested : ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ధాత్రి మధు అరెస్ట్

TRINETHRAM NEWS

ఏపీపీఎస్సీ మూల్యాంకన అక్రమాల ఆరోపణల కేసు

కామన్‌సైన్ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న మధు

హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Trinethram News : విజయవాడకు తరలింపు, విచారణకు ఏర్పాట్లు, మార్కుల తారుమారు, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి కామన్‌సైన్ అనే ప్రైవేట్ సంస్థ డైరెక్టర్ ధాత్రి మధును పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు.

ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, కొందరు అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైన ఈ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధికారులు కొంతకాలంగా దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసు వర్గాల కథనం ప్రకారం పరీక్షల నిర్వహణ ప్రక్రియలో కొన్ని పనుల కోసం కామన్‌సైన్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ధాత్రి మధు నేతృత్వంలోని ఈ సంస్థ మూల్యాంకన ప్రక్రియలో న

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dhatri Madhu arrested in

You cannot copy content of this page

Scroll to Top