MLA Balu Naik : ఎమ్మెల్యే బాలు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రెవెన్యూ అధికారులు

TRINETHRAM NEWS

దేవరకొండ మే 3 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మరియు కొండమల్లేపల్లి మండలాలకు ఇటీవల నూతనంగా నియమితులైన మండల రెవిన్యూ అధికారులు నేడు దేవరకొండ క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో సంభాషిస్తూ, ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నదని గుర్తు చేశారు. అధికారుల విధులు పారదర్శకంగా ఉండాలని సూచిస్తూ, ప్రజా పాలనలో అధికారులు ప్రజల పట్ల జవాబుదారిగా వ్యవహరించాలని ఆయన కోరారు.

మండల రెవెన్యూ కార్యాలయానికి సమస్యలతో వచ్చే ప్రతి పౌరునికి తక్షణమే సేవలు అందేలా చూడాలని, కార్యాలయం ప్రజలకు నమ్మకంగా ఉండే విధంగా పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

అధికారులూ తమ విధుల పట్ల నిబద్ధతతో ఉంటామని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కి హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Revenue officials politely met

You cannot copy content of this page

Scroll to Top