Ramavat Ravindra Kumar : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు

TRINETHRAM NEWS

రమావత్ రవీంద్ర కుమార్..,.
బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు ,దేవరకొండ మాజీ ఎం ఎల్ ఏ…..

దేవరకొండ మే 1 త్రినేత్రం న్యూస్.
-తెలంగాణ ఉద్య‌మంలో కార్మిక‌వ‌ర్గం నిర్వ‌హించిన పాత్ర ఎన‌లేనిది..
-కరోనా కాలంలో సంఘటిత అసంఘటిత, రంగాల కార్మికులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని, నాయకుడు కేవలం కేసీఆర్
-చారిత్రాత్మక మేడే స్పూర్తితో, బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచింది
-తెలంగాణను పారిశ్రామిక ఆదర్శంగా నిలబెట్టి, లక్షల మందికి ఉద్యోగాలు
మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచడం జరిగింది
-కార్మికుల త్యాగాలకు నివాళిగా,కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడతాం..
-కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం ఆటో కార్మికులకు సంవత్సరానికి 12000 వెంటనే అందించాలి
-బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అని బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం మే డే సందర్భంగా పిఏపల్లి మండలం రంగారెడ్డి గూడెం గేట్ వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……తెలంగాణ ఉద్య‌మంలో కార్మిక‌వ‌ర్గం నిర్వ‌హించిన పాత్ర ఎన‌లేనిది అని ఆయన అన్నారు.కరోనా కాలంలో సంఘటిత అసంఘటిత, రంగాల కార్మికులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని, నాయకుడు కేవలం కేసీఆర్ అని తెలిపారు.

చారిత్రాత్మక మేడే స్పూర్తితో, బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కార్మిక హక్కుల కోసం అడుగడుగునా నిలిచింది అని ఆయన అన్నారు.తెలంగాణను పారిశ్రామిక ఆదర్శంగా నిలబెట్టి, లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అని ఆయన అన్నారు.మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పించి సాధికారతను పెంచడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.కార్మికుల త్యాగాలకు నివాళిగా,కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడతాం అని ఆయన తెలిపారు.చెమట బొట్టే.. చరిత్రకు ఆధారం..శ్రామికులే చ‌రిత్ర నిర్మాత‌లు కార్మికులే సంప‌ద సృష్టిక‌ర్త‌లు అని ఆయన అన్నారు.కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తుంది అని వారి త్యాగం వెలకట్టలేనిది అని ఆయన కొనియాడారు.

శ్రామికులకు బోనస్‌లు,ఉద్యోగ భద్రత, మెరుగైన సౌకర్యాలతో గౌరవించడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు.TSRTC కార్మికులకు జీత భత్యాల పెంపు, ఆరోగ్య బీమా వంటి సంక్షేమ పథకాలతో భరోసా కల్పించడం జరిగింది అని ఆయన అన్నారు.ఆటో డ్రైవర్లు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక సహాయం, సంక్షేమ బోర్డులతో బిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉన్నది అని ఆయన అన్నారు.కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం ఆటో కార్మికులకు సంవత్సరానికి 12000 వెంటనే అందించాలి అని ఆయన డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ఎన్నిక హామీలు అయిన అంగన్వాడీ, ఆశా వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్ లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెలుగురి వల్లపు రెడ్డి, కార్మిక నాయకుడు కృష్ణయ్య,ఆర్వపల్లి నర్సింహ, మదా సుదకర్ గౌడ్,ఎర్ర యాదగిరి, బొడ్డుపల్లి మహేందర్, రాయనబోయిన శ్రీను,గొలి గిరి, రమావత్ దామోదర్,రమావత్ తూలిసిరామ్,వెంకన్న,ప్రదీప్,శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Many welfare schemes were

You cannot copy content of this page

Scroll to Top