MLA Adireddy Srinivas : కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటాం

TRINETHRAM NEWS

కార్మికుల ప్రయోజనాలు కాపాడే టీఎన్టీయూసి

పేపరుమిల్లులో టీఎన్టీయూసి జెండా ఎగరేస్తాం

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

టీఎన్టీయూసి ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

కార్మిక నాయకులకు, సీనియర్ కార్మికులకు ‌ఘన సన్మానం

హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నేత గన్ని కృష్ణ

Trinethram News : రాజమహేంద్రవరం:‌కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటామని, వారికి ఎలాంటి కష్టం వచ్చినాఆదుకుంటా మని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) హామీ ఇచ్చారు. తెలుగుదేశంపార్టీ కార్మిక పక్షపాతి అని,‌కార్మికుల ప్రయోజనాల కోసం టీఎన్టీయూసి నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు.మేడేను పురస్కరించుకుని టీఎన్టీయూసి ఆధ్వర్యంలో కంబాలచెరువు మదర్ థెరిసా పార్కు వద్ద గురువారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు హాజరయ్యారు.‌

టీఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మేడే వేడుకల కోసం మూడు రోజులుగా వర్రే శ్రీనివాసరావు,నగర టీఎన్టీయూసి అధ్యక్షుడు నల్లం శ్రీను,నక్కా చిట్టిబాబు, బాక్సు ప్రసాద్,బట్లంకి ప్రకాష్ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి చేసిన కృషి ఇప్పుడు కనిపిస్తోందని అభినందనలు తెలిపారు.దేశాభివృద్ధిలో కార్మికులది కీలక పాత్ర అని అందుకే కూటమి ప్రభుత్వం వారి సంక్షేమానికి కృషి చేస్తోందని ఆయన అన్నారు.కార్మికుల చెమటతో పరిశ్రమలు నడుస్తాయని దేశాభివృద్ధిలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన చెప్పారు.గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో కార్మికులు నష్టపోయారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విమర్శించారు. కార్మికుల సమస్యలను కార్మిక శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు.పేపరుమిల్లులో టీఎన్టీయూసి జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పిలుపునిచ్చారు.

గ్యాస్ ఏజెన్సీ కార్మికులకు మంచి అగ్రిమెంటు చేయించామని ఆయన అన్నారు.రెండేళ్ళ క్రితం మేడే నాడు తనను,తన తండ్రిని వైసీపీ నాయకులు అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపారని , కార్మికుల స్ఫూర్తితో పోరాడి బయటకు వచ్చామని ఆయన గుర్తు చేశారు.కార్మికుల,ప్రజల అండతో ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అందుకే కార్మికులకు ఎప్పుడూ అవసరం వచ్చినా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.కార్మికుల ప్రతి సమస్య పరిష్కారిస్తామని ఆయన అన్నారు.కార్మికుల మంచి కోసం టీడీపీ ఆలోచిస్తుందని,పని చేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు.మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ కార్మికుల పక్షపాతి అని అన్నారు.

పేపరుమిల్లు పరంపర కార్మికులకు న్యాయం చేశామని ఆయన చెప్పారు. తన కుమారుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కార్మికుల‌కోసం నిరంతరం పని చేస్తున్నారని, ఎంతోమందికి గుప్త దానాలు చేస్తున్నారని చెప్పారు.టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ టీడీపీ అనుబంధ సంఘాలను మరింత బలోపేతం చేయాలని కోరారు‌.ఈ సందర్భంగా పలువురు సీనియర్ కార్మికులకు, కార్మిక నాయకులకు ఘన సన్మానం చేశారు.సభలో ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు,కాశి నవీన్ కుమార్,చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will always stand

You cannot copy content of this page

Scroll to Top