MLC Teenmar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు

TRINETHRAM NEWS

Trinethram News : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు జారీ

పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు వ్యతిరేకంగా నకిలీ వీడియోలను విడుదల చేశారని కేటీఆర్, జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

ఈ మేరకు గతేడాది మే 25న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. తమపై నమోదైన ఈ కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్, జగదీశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు

ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య.. పిటిషనర్ల తరఫున న్యాయ వాది వాదనలు వినిపిస్తూ.. వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి కేటీఆర్, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేయలేదన్న టీవీ రమణరావు

రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదైన కేసును కొట్టివేయాలని కోరిన టీవీ రమణరావు.. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులు, తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణ జూన్ 13కు వాయిదా వేసిన హైకోర్టు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

High Court notices to

You cannot copy content of this page

Scroll to Top