AP DEECET : ఏపీలో డీఈఈసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎస్ఈడీ) కోర్సులో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషనన్ను కన్వీనర్, ఆర్జేడీ లింగేశ్వర రెడ్డి విడుదల చేశారు. ఆన్ లైన్ లో మంగళవారం నుంచి మే 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఉమ్మడి ప్రవేశ పరీక్ష జూన్ 2, 3 తేదీల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు https://cse.ap.gov.in, https://apdeecet.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కన్వీనర్ సూచించారు. దరఖాస్తు రుసుము రూ.750లను మే ఏడో తేదీ వరకు చెల్లించేందుకు అవకాశమిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

AP DEECET applications begin

You cannot copy content of this page

Scroll to Top