CM Revanth : జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్

TRINETHRAM NEWS

Trinethram News : జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jammu and Kashmir incident

You cannot copy content of this page

Scroll to Top