Free Medical Camp : నల్గొండ జిల్లా పోలీస్ శాఖావారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యా శిబిరం

TRINETHRAM NEWS

దేవరకొండ ఏప్రిల్ 19 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖా వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారితో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ బాలు నాయక్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ తో పాటు సమాజ సేవలో పోలీసులు ముందుంటారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య ,వైద్య, రంగాలకు మొదటి ప్రాధాన్యత, మారుమూల గ్రామాల్లో గిరిజనులు అనారోగ్యం,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని గుర్తించి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గిరిజనులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ,మహిళలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి అని తెలిపారు.

అన్నిరకాల స్పెషలిస్టువైద్యులతో వైద్య శిబిరాన్ని పోలీస్ శాఖవారు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితి ని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచి ఈ పథకం కింద అందించే వైద్య సేవల చికిత్సల సంఖ్యను పెంచిందని అన్నారు.
త్వరలో దేవరకొండలో ఉన్న ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ 100 పడకలనుంచి 200 పడకల ఆసుపత్రిగా మార్చబోతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం వైద్య శిబిరంలో వైద్యులు చేస్తున్న పరీక్షలను పరిశీలించారు. అనంతరం పోలీస్ శాఖ వారు ఎమ్మెల్యేను మెమెంటో అందజేసి శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో లు వివిధ అనుబంధ సంఘాల నాయకులు ,యువజన కాంగ్రెస్ నాయకులు ,మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ జడ్పిటిసి లు, మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు ,మాజి కోఆప్షన్ సభ్యులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free mega medical camp

You cannot copy content of this page

Scroll to Top