TRINETHRAM NEWS

సామాజిక ఉద్యమకారులకు విరాళాలు ఇచ్చి అండగా నిలుద్దాం

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి,
రాష్ట్ర కార్యదర్శి ఎరవేల్లి ముత్యంరావు,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే -2 ఇంక్లైన్, జీడీకే ఓసీపీ -5, S&PC ఉద్యోగస్తులలో సామాజిక ఉద్యమ నిధిని సేకరించడం జరిగింది, ముఖ్య అతిథులుగా హాజరైన: తుమ్మల రాజారెడ్డి ఎరవెల్లి ముత్యాలరావు మాట్లాడుతూ, వేల సంవత్సరాల నాటి బూజు పట్టిన మనువాద సిద్ధాంతాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని. దేశ భక్తి ముసుగులో మతం పేరుతో శ్రామిక ప్రజలు, కార్మికుల్లో చిచ్చు పెడుతున్నదని. దళితులు, గిరిజనులు, మహిళలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నదని.

రాజ్యాంగ స్ఫూర్తిని భగ్నం చేస్తున్నది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామని బిజెపి అగ్ర నాయకత్వమే బహిరంగంగా ప్రకటించింది. అంబేడ్కర్ అధ్యక్షతన భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసే సమయంలోనే బిజెపి మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రాజ్యాంగం, అంబేద్కర్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిందని. వారు అత్యంత ప్రామాణికంగా భావించే మనుస్మృతికి భారత రాజ్యాంగంలో స్థానం లేకుండా పోయిందని స్వయంగా గోల్వాల్కర్ తమ ‘ఆర్గనైజర్’ పత్రికలో పలు వ్యాసాలు రాశారు. మన దేశానికి ప్రస్తుత రాజ్యాంగం పనికిరాదన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో పాలన చేస్తున్న బిజెపి అదును చూసి రాజ్యాంగంపై దాడి చేస్తున్నది ఈ ప్రమాదాలను కార్మికవర్గం ప్రతిఘటించాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి
భారత రాజ్యాంగంలో ఆర్టికల్-14, 16, 19 (1) (సి), 23, 24, 38, 41ల ద్వారా కార్మిక హక్కులకు అత్యంత ప్రాధాన్యత కల్పించారు.

కార్మికుల సంక్షేమం, హక్కులు, బాధ్యతలు రాజ్యాంగంలో పొందుపర్చారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ళలో ప్రభుత్వరంగ సంస్థలను ఆధునిక దేవాలయాలతో పోల్చారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆర్టికల్-14కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. చట్టం ముందు అందరూ సమానమేననే భావనలకు తిలోదాకాలిచ్చిందని. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చి కార్మిక హక్కులను హరించనున్నది. యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు, సంఘటిత శక్తి, బేరసారాల హక్కులపై దాడి చేస్తూ కార్పొరేట్ల లాభాలకు కార్మికవర్గాన్ని బలి చేస్తున్నది. ఒకవైపు నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, మరోవైపు మనువాద మతోన్మాద విధానాలను ఏకకాలంలో అమలు చేస్తూ సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్నదని. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, మూసివేయడం, వాటి ఆస్తులను నేషనల్ మానైటేజేషన్ పైప్లైన్ ద్వారా తెగనమ్మడం, ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం వంటి నిర్ణయాల వల్ల దళిత, గిరిజన, బలహీన, పీడిత వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను నీరుగారుస్తున్నది.

పేదలకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను కాలరాస్తున్నదని. ఇలాంటి పరిస్థితులలో సామాజిక సమస్యలపై కులం మతం అంతంకై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలైన గిరిజన సంఘం కెవిపిఎస్ సంఘాలకు అండగా నిలవడం కోసం సామాజిక ఉద్యమ నిధిని సిఐటియుగా సేకరిస్తున్నామన్నారు, సేకరించిన నిధిని ఆయా సంఘాలకు అందజేస్తామని సహకరించిన సింగరేణి కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మధు, కార్యదర్శి మేదరి సారయ్య, ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, సానం రవి, వంగల రామన్న, పి శ్రీనివాసరావు, అన్నబోయిన శంకర్, ఈద వెంకటేశ్వర్లు, పెనుమల్ల శ్రీనివాస్, చిలువేరి రవీందర్, గోవర్ధన్ రావు, మేదరి కుమార్, సాన బోయిన సాయి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's fight for the