TRINETHRAM NEWS

ఆటో కార్మికులను రోడ్డున పడేశారు: హరీష్‌రావు

Trinethram News : సిద్దిపేట జిల్లా: కార్మికులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తూ మరొకరి ఉసురుపోసుకుందని వ్యాఖ్యానించారు.

ఆటో కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. గ్రామాలకు మరిన్ని బస్సులు పెంచాలని హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ప్రారంభించిన హరీష్‌రావు అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఆటో కార్మికుల ఆలోచనలో మార్పు వచ్చిందని.. ఆటో కార్మికులు సొసైటీ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రానికే ఆదర్శమన్నారు. ఆటో కార్మికులను ఈ ప్రభుత్వం రోడ్డున పడేసిందని, ప్రభుత్వం వీరి కోసం ఆలోచన చేసి నెలకు రూ.15వేల జీవన భృతి ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు.