ఖని లో నసుయ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన నసుయ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి & రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ నసుయ్ 54 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఖని రీగల్ చౌరస్తా లో నసుయ్ జెండా ఆవిష్కరించారు అనంతరం కేక్ కటింగ్ చేసి
ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మరియు మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర వచ్చినప్పటి నుండి మన దేశం ప్రపంచం తో పోటీ పడాలి అంటే ముందు విద్య వ్యవస్థను అభివృద్ధి, మెరుగు పరచాలని ఒక దృఢ సంకల్పం తో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1956 లో యూజీసీ నియమాలను ప్రొపోజ్ చేసి దేశంలో 47 సెంట్రల్ యూనివర్సిటీలను నెలకొల్పారు…
జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ ని స్థాపించి భారత దేశ చరిత్రలో ఒక గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించారు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యా ప్రమాణాలతో ఐఐటీ లను 1950 లో ఏర్పాటు చేసి నీఫ్ట్, ఐమ్ లను కూడా ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కి సొంతం అని అన్నారు 1949 లో ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించి 2009 విద్యా హక్కు చట్టం ద్వారా విద్య వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో అమలు చేయడం జరిగింది అని అన్నారు భారత దేశ యొక్క ఆరోగ్య వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండాలనే సంకల్పంతో ఎయిమ్స్ ఢిల్లీ 1956 లో ఏర్పాటు చేశారని తెలిపారు మన తెలంగాణ రాష్ట్ర లో కూడా నైట్ వరంగల్ జన్తు హైదరాబాద్ హసు బాసర ఐఐటి లాంటి గొప్ప విద్యా సంస్థలను స్థాపించి దూర విద్యా దృష్ట్యా డ్ర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలల హాజరును పెంచడం మరియు డ్రాప్-అవుట్ రేట్లను తగ్గించడం కోసం మిడ్ డే మిల్ స్కీమ్ ను విస్తరించాయి.
ఈ ప్రోగ్రామ్ ద్వారా పిల్లల ఆరోగ్యము మరియు పోషణ స్థితిని మెరుగు పరిచిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అని అలానే పాఠశాలలకు హాజరుకావడం మరియు విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయం చేశాయి. ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాలు కొన్ని ఉదాహరణలు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం, పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్స్ మరియు వృత్తి శిక్షణ పథకాలు ప్రవేశపెట్టాయి, ఇవి యువతలకు మంచి ఉద్యోగ అవకాశాలను అందించాయని అన్నారు యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎప్పుడు విద్యార్థులకు అండగా ఉంటున మ్మెల్యే మకాన్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు
సమాజం లో ఒక విప్లవాత్మకమయిన మార్పు కోసం యువత ముందుకు రావాలని దానికి నసుయ్ ఒక మంచి మార్గం అని అలాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పడు యువతకు అండగా ఉంటుందని తెలియజేసి విద్యార్థులందరికీ నసుయ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ,సోషల్ మీడియా వారియర్లు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


