Jalagam Prasad Rao : మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు పెద్ద వాగు ప్రాజెక్టు ను పరిశీలన

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. ఈరోజు మాజీ మంత్రి జలగం ప్రసాద్ రావు గుమ్ముడవల్లి పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించడం జరిగింది దీనిలో భాగం గా ఈ నెల 17వ తారీకు సెంట్రల్ కమిటీ మెంబర్ హుస్సేన్ నాయక్ పెద్దవాగు ప్రాజెక్టును సందర్శిస్తున్నారని చెప్పారు కావున ఆ తేదీన గ్రామస్తులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని మహిళలు అందరు కూడా పాల్గొని మన సమస్యను వారికి వివరిస్తే వారు కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్టుకు పూర్వ వైభవం తెచ్చే విధంగా సహకరిస్తానని జలగం ప్రసాద్ రావు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

గడిచిన వర్ష కాల సమయం లో వరద నీరు అధికంగా పోటు ఎతడం వల్ల నా గుమ్ముడ వల్లి పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్లు వద్ద నీటి ఉద్రిక్తత ఎక్కువ అవడం వలన ఆనకట్ట తెగిపోవడం జరిగింది దీని వల్ల ఈ సంవత్సరం రైతులకు నీటి సదుపాయం సకాలంలో అందక పోవడం వలన పంట దిగుబడి కూడా సరిగా లేదు అని రైతులు అందరు వ్యక్తం చేసారు కాబట్టి వచ్చే సంవత్సరం పంటల సమయం వరకు ఈ పెద్ద వాగు ప్రాజెక్టు ఆన కట్టను పూర్తి చేయాలని రైతులు ప్రభుత్వం ను కోరుతున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

the big canal project

You cannot copy content of this page

Scroll to Top