Pending Bills : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. మాజీ సర్పంచులపెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్ లు మునుగోటి రవీందర్రావు, తoడుకవిత చంద్రయ్య అన్నారు.
ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించాలని శాంతియుత నిరసనకు చలో అసెంబ్లీ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్యక్రమానికి వెళ్లకుండా డిండి మండల పోలీసులు ముందస్తుగా మాజీ సర్పంచ్ లను అరెస్టు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లు మాట్లాడుతూ… ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వ వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామనిఈ సందర్భంగా వారు అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

pending bills of former Sarpanchs

You cannot copy content of this page

Scroll to Top