డిండి (గుండ్లపల్లి) మార్చ్ 10 త్రినేత్రం న్యూస్.
స్వయంగా విద్యార్థులే ఉపాధ్యాయులు అయిన వేల.
స్వపరి పాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు.
దిండి మండల కేంద్రంలోని స్థానిక ఆల్ఫా ఆదర్శ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.స్వ ప పరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు కలెక్టర్ గా వంశీ, డిప్యూటీ కలెక్టర్ గా ఇఫ్రాజబీన్, ప్రధానోపాధ్యాయులుగా తరుణి, డి ఈ ఓ గా ఆద్య, ఎంఈఓ గా అక్షర, ప్రభుత్వాధికారులుగా పాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ భారతి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి స్వయం ప్రభుత్వం అనేది విద్యార్థులకు వారి పాఠశాల కళాశాల జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనడానికి మరియు తమ నాయకత్వ నైపుణ్యాలలో పెంపొందించుకోవడానికి గొప్ప అవకాశం లాంటిదని అన్నారు ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు అధికారుల లక్షణాలను అలవర్చటమే కాకుండా, సమాజ సేవలో వారి బాధ్యతలను గుర్తుచేసి అర్థం చేసు కునేల చేస్తాయి.
మరియు విద్యార్థులు భవిష్యత్తులో సమాజాన్ని నడిపించే నాయకులుగా ఎదగాలంటే చిన్నవయసులోనే వారి సామర్థ్యాలను మెరుగు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్వపరి పాలన దినోత్సవం ద్వారా విద్యార్థులు నిబద్ధత క్రమశిక్షణ సమర్ధత వంటి విలువలలో అభ్యసిస్తారని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొ న్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల ప్రధానత్సవం చేయడం జరిగింది.
పాఠశాల ఉపాధ్యాయులు సినీ ప్రకాశ్, కీర్తి, భాగ్యలక్ష్మి, భా ర్గవతి, పూజ, లింగమయ్య, మరియు విద్యార్థిని విద్యార్థుల అందరి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


