Trinethram News : Andhra Pradesh : హోంమంత్రి అనిత విశాఖలోని రేవతి అనే
కానిస్టేబుల్కు సీమంతం చేశారు. సోదరిలా పసుపు, కుంకుమ అందించి ఆశీర్వదించారు. దీంతో ఆ మహిళ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. సోదరిలాంటి దానివని ఎల్లవేళలా అండగా ఉంటానని మంత్రి మాటిచ్చారు. అయితే గత ప్రభుత్వంలో అనితను గృహ నిర్భందం చేయడానికి సదరు కానిస్టేబుల్ వచ్చారు. ఇప్పుడు సీమంతం చేయడంతో హోంమంత్రిది మంచి మనసని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


