త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. మహిళలు అన్ని రంగాలలో మేటిగా నిలబడాలని, మహిళా సాధికారికత కోసం ఆకాంక్షించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,అని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పేర్కొన్నారు.
అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు.
- వివిధ రంగాలకు చెందిన 150 మంది మహిళలను సత్కరించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు.
అనపర్తి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలు వైయస్ఆర్‌సీపీ అనపర్తి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఇమ్మంది విజయకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి, అధ్యక్షతన వహించారు.
తొలుత, మహిళా సాధికారతను ఆకాంక్షించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి సత్తి ఆదిలక్ష్మి, తదితర మహిళలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు.
ఈ సందర్భంగా, ప్రధానోపాధ్యాయురాలుగా పదవీ విరమణ చేసిన గొలుగూరి విజయలక్ష్మి, రాపాక లిల్లి మార్గరేట్, పలివెల విజయకుమారి, బిక్కవోలు మండల ప్రజా ఇంచార్జ్ అధ్యక్షురాలు వి. వెంకటలక్ష్మి సహా వివిధ రంగాలకు చెందిన 150 మంది మహిళలను సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి గారు, మహిళా విభాగం అధ్యక్షురాలు విజయకుమారి కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, ఆదిలక్ష్మి దంపతులు మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పార్టీ కార్యాలయంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, రిజర్వేషన్లతో సంబంధం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మహిళలకు కేటాయించడం ద్వారా వారి అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారని ప్రశంసించారు. రాష్ట్రంలో మహిళలకు మరిన్ని మంచి రోజులు రావాలంటే మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి, నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో సర్పంచులు వారా కుమారి, కుడిపూడి మాధవి లత, డోకబుర్ర మీనాక్షి, గుత్తుల పుష్ప, వేణు, ఎంపీటీసీలు మచ్చ పాప, కర్రి గీతా సావిత్రి గుత్తుల పాప, గుత్తుల మహాలక్ష్మి, తుమ్మ రాజేశ్వరి,పడాల చంద్రకళ ,తేతలి కళావతి ,బొడ్డు సునీత తదితరులు మహిళా ప్రజాప్రతినిధులు, వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం నాయకురాలు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


