CPM Party : సిపిఎం పార్టీ జిల్లా ప్లీనం సమావేశం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 9: పాడేరులో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
బి సి హెచ్ .పడల్ అధ్యక్షతనములో జరిగిన
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
కే .లోకనాదం హాజరై మాట్లాడుతూ,
రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో జివో నెంబర్ 3 చట్టబద్ధతకై ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టం చేయాలి.
ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్న గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శ చేశారు.
రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 8 నుండి 17 తారీకు దాకా ఏజెన్సీ వ్యాప్తంగా స్థానిక సమస్యలపై ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
అనంతరం మార్చి 24 25 తేదీల్లో ఏజెన్సీ 11 మండలాల్లో కూడా ధర్నాలు ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు పిలిపించారు.
ఏజెన్సీలో ఒకటి బై 70 చట్టం పటిష్టంగా అమలు కోసం అసెంబ్లీలో చర్చించి ఒకటి బై 70 చట్టం పటిష్టంగా అమలు చేయడానికి కృషి చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలైన జీవో నెంబర్ 3 స్పెషల్ డిఎస్సి చట్టబద్ధ చేసి అసెంబ్లీ సమావేశంలో ప్రకటించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే. లోకనాథం గారు డిమాండ్ చేశారు.
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ,
ఏజెన్సీలో పీఎం జన్మన్ పథకం ద్వారా నిర్మిస్తున్న ఇల్లులకు 5 లక్షలు పెంచాలని మిరియాలు పంటకు కిలో 1000 రూపాయలు కాఫీ 500 రూపాయలు పసుపు కిలో 200, జీడి పిక్కలు 200, చింతపండు కిలో 50 రూపాయలు గిట్టు పెట్ట ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఏజెన్సీ మండలంలో టోకురు ,పెద్దకోట చింతపల్లి, ఎర్రవరం పంచాయతీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇచ్చినా అనుమతులు రద్దుచేయాలని డిమాండ్ చేసారు .
గిరిజన ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలకు ఫారెస్ట్ అనుమతులు లేక కాంట్రాక్టులు రోడ్డు నిర్మించకుండా జాప్యం చేస్తున్నారు గిరిజన గ్రామాలలో రోడ్డు నిర్మాణం కోసం అడ్డుగా ఉన్న ఫారెస్ట్ చట్టాలు సవరణ చేసి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి .ఉమామహేశ్వరరావు ,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. గంగరాజు (జెడ్పిటిసి అనంతగిరి) సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ బి .పోతరాజు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొర్రా త్రినాథ్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కిండంగి రామారావు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పాలికి .లక్కు, వివి .జయ ఎస్ .హైమా పి. కుమారి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPM Party Plenum Meeting

You cannot copy content of this page

Scroll to Top