డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హామీలను వెంటనే అమలు చేయాలి లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యారెంటీలు ఆటకెక్కినట్లేనా?
అమలుకు నోచుకోని ఎన్నో హామీలను ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినంక ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మరిచారని , భారత రాష్ట్ర సమితి దిండి మండల నాయకులు మూడవ మల్లేష్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఇచ్చిన హామీలను ఆటకెక్కించి ప్రజలను అధోగతి పాలు చేసిందని రైతుబంధును తీసేసి రైతు భరోసాగా పేరు మార్చి రైతులను ఏ ఏం ఉద్ధరించారని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టి ఇప్పటివరకు యాసంగి సైతం ఇవ్వకుండా అక్కడక్కడ కొసమెరుపుగా కొంతమందికి మాత్రమే వేసి చేతులు దులుపుకుందని ఆయన అన్నారు ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్నా ఆశలను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఇంతేనా అని ఆచరణలో నిరూపించుకుందని రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా ఆయన కోరారు
ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించింది ప్రజల సమస్యలు తీరుస్తారని కానీ మీరు మీ ప్రభుత్వం ప్రజలకు లేనిపోని సమస్యలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని మీ తీరు మార్చుకొని మీ స్వలాభాలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


