CPI : మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి లౌకిక శక్తులు ఏకం కావాలి

TRINETHRAM NEWS

ఏ పోరాటానికైనా సైన్యం అవసరం
కమ్యూనిస్ట్ పార్టీ కు కార్యకర్తలే సైన్యం

శ్రామిక వర్గ విముక్తే అంతమ లక్ష్యం

మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి లౌకిక శక్తులు ఏకం కావాలి

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ పిలుపు

రాజమండ్రి, మార్చి 5 :
దేశంలో మతోన్మదాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు

బుధవారం ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో మూడు రోజుల సీపీఐ జిల్లా స్థాయి కార్యకర్తల వర్క్ షాప్ ను అక్కినేని వనజ ప్రారంభించారు . దీనికి రైతు సంఘము జిల్లా అధ్యక్షులు పంతం నాగేశ్వరావు అధ్యక్షత వహించారు
ముందుగా సీపీఐ జిల్లా కార్యదర్శి మూడు రోజుల వర్క్ షాప్ ను వివరాలను వెల్లడించారు

అక్కినేని వనజ మాట్లాడుతూ
ఈ సమాజం లో పౌరాలందరకి సమాన అవకాశాలు, హక్కులు లేవని అత్యధిక వర్గాల వారు తమ శ్రమతో బతుకు బండి కష్టంగా ఉందని అన్నారు వీరి శ్రమ ఫలితంగా అప్పనంగా అనుభవించే అల్ప సంఖ్యావర్గం గా ఉందని ఆమె అన్నారు. ఈ దోపిడీ నుండి శ్రామిక వర్గం విముక్తి కోసం పార్టీ కార్యకర్తలు సైద్దంతికంగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు రాజకీయ బోధన అనేది సిద్ధాంత పోరాటం లో అంతర్బంగా ఉండాలని ఆమె అన్నారు నేటి సమాజంలో యువత ను పాలకులు విష సంస్కృతి లో వుండే విధంగా కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు విద్యార్థి యువకులు దేశం కోసం, సమాజం కోసం ఆలోచించలని ఆమె తెలిపారు
ప్రజాసమస్యల మీద అవగాహన చేసుకుని ప్రజా పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు

అనంతరం మార్క్సిస్ట్ తత్వ శాస్త్రం మూలసూత్రాలు అనే అంశంపై ప్రొఫెసర్ రాజబాబు మాట్లాడారు మధ్యాహ్నం నుండి దోపిడీ అంటే ఏమిటి వివిధ రూపాలు పరిష్కార మార్గాలు అనే అంశంపై ప్రొఫెసర్
కె వెంకటరమణ మాట్లాడారు

ఈ వర్క్ షాప్ లో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వి కొండల రావు, కె జ్యోతి రాజు, కె శ్రీనివాస్ చింతలపూడి సునీల్, సప్ప రమణ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top